Chorus
అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నఁదరంబయో కన్న
తండ్రి వన్నె కెక్కిన మోక్ష వాసాళి సన్నుతు లున్నతమై యుండ మున్నె నీకు‖ నన్ని ‖
Verse
నిన్నుఁ బ్రకటన సేయ నిఖిల లోకములను బన్నుగఁ జేసిన బలుఁడ
వీవె ఉన్న లోకంబుల -నుడుగక కరుణా సం-పన్నతతో నేలు
ప్రభుఁడ వీవె అన్ని జీవుల నెఱిఁగి యాహార మిచ్చుచు నున్న సర్వజ్ఞుం
డవు నీవే ఎన్న శక్యముగాక ఉన్న లక్షణముల సన్నుతించుటకు
నేఁ జాలుదునా‖ యన్ని ‖
Verse
పుట్టింప నీవంచుఁ బోషింప నీవంచుఁ గిట్టింప నీవంచు గీర్తింతును
నట్టి పనికి మాలి నట్టి మానవుల చే పట్టి రక్షింపం బాధ్యుండ వంచు
దట్టమైన కృపను దరిఁజేర్చ నాకిచ్చి పట్టయి నిలచియుండు ప్రభుఁడ
వంచుఁ గట్టడచేఁ గడ ముట్టుదనుక నా పట్టుకొలఁది నిన్నుఁ బ్రస్తు
తింతు‖ నన్ని ‖
Verse
కారుణ్యనిధి వీవు కఠినాత్ముఁడను నేను భూరి శుద్ధుఁడ వీవు పాపి
నేను సార భాగ్యుడ వీవు జగతిలో నాకన్న దారిద్రుఁడే లేఁడు
తరచి చూడ సార సద్గుణముల సంపన్నుఁడవు నీవు ఘోర దుర్గుణ
సంచారి, నేను ఏ రీతి స్తుతియింతు నే రీతి సేవింతు నేర మెన్నక
ప్రోవ నెర నమ్మితి‖ నన్ని ‖