Verse
అన్ని నామముల కన్న ఘనమైన నామము నీది యేసు నాథా
అందరిని ప్రేమించు ఆదరణ కర్తవయ్యా ప్రాణ నాథా
యెహోవ ఈరే అని పిలువబడినవాడ‖ 2x ‖
నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు‖ 2x అన్ని నామముల ‖
Verse
దేవతలకన్నా దయగలవాడవు
క్షమించు మనసున్న మహారాజువు‖ 2x ‖
ప్రేమామయుడవు ప్రభువగు దేవుడవు
ప్రాణము పెట్టిన ప్రభు యేసువు‖ అన్ని నామముల ‖
Verse
గాలి తుఫానులను ఆపినవాడవు
నీటిపై నడచిన నిజ దేవుడవు‖ 2x ‖
జానతో ఆకాశాన్ని కొలిచినవాడవు
శాంతి సమాధానం నొసగే దేవుడవు‖ అన్ని నామముల ‖