Verse
అన్ని నామముల కన్న పై నామము – యేసుని నామము
ఎన్ని తరములకైనా ఘనపరచ దగినది – క్రీస్తేసు నామము‖ 2x ‖
యేసు నామము జయం జయము
సాతాను శక్తుల్ లయం లయము‖ 2x ‖
హల్లెలూయ హొసన్న హల్లెలూయా – హల్లెలూయా ఆమెన్‖ 2x ‖
Verse
పాపముల నుండి విడిపించును – యేసుని నామము‖ 2x ‖
నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును – క్రీస్తేసు నామము‖ 2x యేసు నామము ‖
Verse
సాతాను పై అధికార మిచ్చును
శక్తి గల యేసు నామము‖ 2x ‖
శత్రు సమూహము పై జయమునిచ్చును
జయశీలుడైన యేసు నామము‖ 2x యేసు నామము ‖
Verse
స్తుతి ఘన మహిమలు చెల్లించుచు
క్రొత్త కీర్తన పాడెదము‖ 2x ‖
జయ ధ్వజమును పైకెత్తి కేకలతో
స్తోత్ర గానము చేయుదము‖ 2x యేసు నామము ‖