Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Anni Saadhyame

అన్నీ సాధ్యమే

Anni Saadhyame

Verse
అన్నీ సాధ్యమే
యేసుకు అన్నీ సాధ్యమే‖ 2x ‖
అద్భుత శక్తిని నెరపుటకైనా
ఆశ్చర్య కార్యములొసగుటకైనా‖ 2x ‖
ఆ యేసు రక్తానికి
సాధ్యమే సాధ్యమే సాధ్యమే‖ 2x అన్నీ సాధ్యమే ‖
Verse
మాధుర్యమైన జలముగా – మారాను ప్రభు మార్చెను
మృత్యువు నుండి లాజరును – మాహిమార్థముకై లేపెను‖ 2x ‖
మన్నాను కురిపించగా – ఆకాశమే తెరిచెను
మరణాన్ని ఓడించగా – మృత్యుంజయుడై లేచెను‖ 2x అన్నీ సాధ్యమే ‖
Verse
బండనే చీల్చగా – జలములే పొంగెను
ఎండిపోయిన భూమిపై – ఏరులై అవి పారెను‖ 2x ‖
బందంటే క్రీస్తేనని – నీ దండమే తానని
మెండైన తన కృపలో – నీకండగా నిలచును‖ 2x అన్నీ సాధ్యమే ‖
Verse
ఏకాంతముగా మోకరిల్లి – ప్రార్ధించుటే శ్రేయము
ఏల నాకీ శ్రమలని – పూర్ణ మనసుతో వేడుము‖ 2x ‖
యేసయ్య నీ వేదన – ఆలించి మన్నించును
ఏ పాటి వ్యధలైననూ – ఆ సిల్వలో తీర్చును‖ 2x అన్నీ సాధ్యమే ‖
Verse
కష్టాల కడలిలో – కన్నీటి లోయలో
కనికరమే ప్రభు చూపును – కంటిపాపలా కాయును‖ 2x ‖
కలిగించు విశ్వాసము – కాదేదీ అసాధ్యము
క్రీస్తేసు నామములో – కడగండ్లకే మోక్షము‖ 2x అన్నీ సాధ్యమే ‖

Related Tags

WorshipFaithJesusMiracles