Verse 1
అన్ని వేళల వినువాడు నీ ప్రార్ధనలన్నియు
ఏ బేధము లేకనే ఆలకింపనైయున్నాడు‖ 2x ‖
ప్రార్ధించుము అలయకనే
కనిపెట్టుము విశ్వాసముతో‖ 2x ‖
నీ ప్రార్ధనే మార్చును నీ స్థితి
నీ ఎదలో కన్నీరు తుడచును‖ 2x అన్ని ‖
Verse 2
కుమిలిపోతూ నలిగిపోతూ
ఏమౌతుందో అర్ధం కాక‖ 2x ‖
వేదన చెందుతూ నిరాశలో మునిగావా‖ 2x ‖
ఒకసారి యోచించుమా
నీ మొఱ్ఱను వినువాడు యెసయ్యే‖ 2x అన్ని ‖
Verse 3
ఎవరికీ చెప్పుకోలేక
అంతగా బాధ ఎందుకు‖ 2x ‖
మొఱ్ఱపెట్టిన వారికి సమీపముగా యేసు ఉండును‖ 2x ‖
ఒకసారి యోచించుమా
నీ మొఱ్ఱను వినువాడు యెసయ్యే‖ 2x అన్ని ‖