Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Annivelala Anandame

అన్నివేళలా ఆనందమే

Annivelala Anandame

Lyricist: Pastor P V Moses Rao
Verse
అన్నివేళలా ఆనందమే యేసులో ఉన్నవారికి
అన్నివేళలా ఆదరణయే యేసుతో ఉన్నవారికి
Verse
నిన్నటి బాదలు నేటికి లేవు
రేపటి గూర్చిన చింతయు లేదు
తనమహిమలో ప్రతి అక్కర తీరును
తన రెక్కలతో నను కాపాడును
Verse
అనుక్షణము నా ప్రాణము కాయుచు
అను దినము నా భారము మోయుచు
అంగలార్పును నాట్యము చేసెను
ఆనందముతో నా మదినింపెను
Verse
అదిగదిగో నా కొరకు దిగివచ్చుచున్నది
పండ్రెండు గుమ్మముల ఆ మహానగరం
వేదన రోదన ఇక నాకుండదు
ప్రియుని వడిలోనే ఆనందింతును

Related Tags

Second ComingComfortJoy