Verse
అన్నివేళల వినువాడు
నీ ప్రార్ధనలన్నియు
ఏ బేధములేకనే
ఆలకింపనైయున్నాడు
ప్రార్ధించుము అలయకనే
కనిపెట్టుము విశ్వాసముతో
నీ ప్రార్ధనే మార్చును నీ స్థితి
నీ ఎదలో కన్నీరు తుడుచును
కుమిలిపోతూ, నలిగిపోతూ
ఏమౌతుందో అర్ధం కాక
వేదన చెందుతు నిరాశలో మునిగావా?
ఒకసారి యోచించుమా
నీ మొరను వినువాడు యేసయ్యే
ఎవరికి చెప్పుకోలేక
అంతగా బాధ ఎందుకు?
మొరపెట్టినవారికి సమీపముగా యేసు ఉండును
ఒకసారి యోచించుమా
నీ మొరను వినువాడు యేసయ్యే