Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Antaraani Vaadavantu

అంటరాని వాడవంటు

Antaraani Vaadavantu

Lyricist: Joel Kodali
Verse
అంటరాని వాడవంటు నన్ను
ఊరు బైటకు త్రోసి వేసిరి
దేహమంతా కుళ్లిపోయి – దుర్వాసనతో నిండిపోయే
అయిన వారు కానరాక – భుజము తట్టే వారు లేక
కంటి నిండా నిదుర పొక – ఒంటరిగ జీవించలేక
మరణమును బ్రతిమాలుకున్నా…
మరణమును బ్రతిమాలుకున్నా – అదియు నన్ను ముట్టలేదు
చావలేక బ్రతుకలేక విసికిపోయాను – నేను అలసిపోయాను
నీ దరికి చేరాను – నిన్నే నమ్ముకున్నాను
యేసు.. యేసు.. యేసు నా తట్టు తిరగవా
యేసు.. యేసు.. యేసు నా గోడు వినవా‖ అంటరాని ‖
Verse
నిలిచిపోయావు నా కేక వినగానే
కదలిపోయావు నా స్థితిని చూడగనే
నీ కడుపులోని దుఖమును నీ ముఖముపై చూసి
నేను కరిగిపోయాను
నీ కనికరము చూసి – కన్నీటితో తడిసిపోయాను
యేసు.. యేసు.. యేసు నీకెంత జాలి
చాలు.. చాలు.. చాలు నీ దయయే చాలు‖ అంటరాని ‖
Verse
నన్ను తాకావు నీ చేతులను చాపి
కుష్టు రోగము నా దేహము పైన ఉండగనే
నా గుండె లోపల మండుచున్న కోరికను చూసి
నన్ను ముట్టుకున్నావు
ఆ స్పర్శకొరకే కదా నే తపియించి పోయాను
యేసు.. యేసు.. యేసు నీలా ఉందురెవరు
చాలు.. చాలు.. చాలు నీ స్పర్శ చాలు‖ అంటరాని ‖
Verse
స్వస్థపరిచావు శుద్దునిగా చేసావు
మురికి కూపము నుండి నన్ను లేవనెత్తావు
నా తలను పైకెత్తుకొని బ్రతికే తరుణమిచ్చావు
నాకు బ్రతుకు నిచ్చావు
నిను ఆశ్రయించి నిరాశచెందు నరులు ఎవ్వరు
యేసు.. యేసు.. యేసు దండములు నీకు
చాలు.. చాలు.. నాకింక నీవే చాలు‖ అంటరాని ‖

Related Tags

HealingRepentanceMercy