Verse
నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్‖ 2x ‖
Chorus
అంతా నా మేలుకే – ఆరాధన యేసుకే
అంతా నా మంచికే – తన చిత్తమునకు తల వంచితే
తన చిత్తమునకు తల వంచితే
ఆరాధన ఆపను – స్తుతియించుట మానను‖ 2x స్తుతియించుట మానను ‖
Verse
కన్నీళ్లే పానములైనా – కఠిన దుఃఖ బాధలైనా
స్థితి గతులే మారినా – అవకాశం చేజారినా‖ 2x ‖
మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ‖ 2x ‖
మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ‖ 2x అంతా ‖
Verse
ఆస్తులన్ని కోల్పోయినా – కన్నవారే కనుమరుగైనా
ఊపిరి భరువైనా – గుండెలే పగిలినా‖ 2x ‖
యెహోవా ఇచ్చెను – యెహోవా తీసుకొనెను‖ 2x ‖
ఆయన నామమునకే – స్తుతి కలుగు గాక‖ 2x అంతా ‖
Verse
అవమానం ఎంతైనా – నా వారే కాదన్నా
నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున‖ 2x ‖
నీవు నాకుండగా – ఏది నాకక్కర లేదు‖ 2x ‖
నీవు నాకుండగా – ఏది నాకక్కర లేదు‖ 2x అంతా ‖
Verse
ఆశలే సమాధియైనా – వ్యాధి బాధ వెల్లువైనా
అధికారం కొప్పుకొని – రక్షణకై ఆనందింతును‖ 2x ‖
నాదు మనస్సు నీ మీద – ఆనుకొనగా ఓ నాథా‖ 2x ‖
పూర్ణ శాంతి నే పొంది – నిన్నే నే కీర్తింతున్‖ 2x అంతా ‖
Verse
చదువులే రాకున్నా – ఓటమి పాలైనా
ఉద్యోగం లేకున్నా – భూమికే భరువైనా‖ 2x ‖
నా యెడల నీ తలంపులు – ఎంతో ప్రియములు‖ 2x ‖
నీవుద్దేశించినది – నిశ్ఫలము కానేరదు‖ 2x అంతా ‖
Verse
సంకల్పన పిలుపొంది – నిన్నే ప్రేమించు నాకు
సమస్తము సమకూడి – మేలుకై జరుగును‖ 2x ‖
యేసుని సారూప్యము – నేను పొందాలని‖ 2x ‖
అనుమతించిన ఈ – విలువైన సిలువకై‖ 2x అంతా ‖
Verse
నీవు చేయునది – నాకిప్పుడు తెలియదు
ఇక మీదట నేను – తెలిసికొందును‖ 2x ‖
ప్రస్తుతము సమస్తము – దుఃఖ కరమే‖ 2x ‖
అభ్యసించిన నీతి – సమాధాన ఫలమే‖ 2x అంతా ‖