Verse 1
అంతము సమీపమైయున్నది దేవుని తీర్పు రానున్నది
Verse
ఈ యుగము ముగింపబడుచున్నది నీవు సిద్ధపడి యున్నావా
కాలము బహు కొంచమే ఉన్నది నీవు సిద్ధపడి యున్నావా
నీ ఆత్మ సిద్ధపరచుకున్నావా
Verse
లోకపు నటనను ధరియించి వేషధారిగా ఉంటివా
పైకి భక్తిగల వాడై దేవుని శక్తిని ఆశ్రయించవా
మారుమనస్సే లేనిచో క్షమాపణే లేదని గ్రహించుచున్నావా
కాలమే కొంచెము సమయమే లేదని గ్రహించుచున్నావా
Verse
పరిశుద్ధాత్మను కలిగుండి నీవు నడచుచుంటివా
నీ జీవము దేవుని యందు భద్రపరచియుంటివా
పరిశుద్ధాత్మయే లేనిచో పరలోకమే లేదని గ్రహించుచున్నవా
కాలమే కొంచెము సమయమే లేదని గ్రహించుచున్నావా
Verse
సత్యము గూర్చిన జ్ఞానమును నీవు కలిగియుంటివా
ప్రత్యక్షతను పొందక సత్యమునే ఎదురింతువా
సత్యమే లేనిచో నిత్యజీవమే లేదని గ్రహించుచున్నావా
కాలమే కొంచెము సమయమే లేదని గ్రహించుచున్నావా