Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Anthe Leni Nee Prema Dhaara

అంతే లేని నీ ప్రేమ ధార

Anthe Leni Nee Prema Dhaara

Lyricist: Kranthi Chepuri
Verse
అంతే లేని నీ ప్రేమ ధార
ఎంతో నాపై కురిపించినావు
వింతైన నీ ప్రేమ కొంతైన గాని
కాంతింప కృప నాకు చూపించినావు‖ 2x ‖
ఎంతో ఎంతో నీ ప్రేమ ఎంతో
పొందేటందుకు నే యోగ్యుడను (యోగ్యురాలు) కాను
అంతో ఇంతో ఆ ప్రేమను నేను
పంచేటందుకు నీ భాగ్యము పొందాను‖ అంతే ‖
Verse
పరిశుద్ధుడు పరిశుద్ధుడు
అని దూతలతో పొగడబడే దేవా
పదివేలలో అతి సుందరుడా
నీవేగా అతి కాంక్షనీయుడా‖ 2x ‖
నా దోషములకై ఆ కలువరి సిలువలో
బలియాగమైనావ దేవా‖ 2x ‖
సొంతముగా నే చేసిన నా పాపములన్ని
శాంతముతో సహియించి క్షమియించినావు
పంతముతో నిను వీడి నే పారిపోగా
నీ రాజ్యమునకు చేర్చగ వంతెన అయినావు‖ అంతే ‖
Verse
ఏమున్నదీ నాలో దేవా
మంచన్నదే లేనే లేదు
అయినా నీవు నను రక్షించి
నీ సాక్షిగ నిలిపావు ఇలలో‖ 2x ‖
అర్హతయే లేదు నీ పేరు పిలువ
నీ సొత్తుగా నను మార్చినావా‖ 2x ‖
ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు బదులు
నా జీవితమంతయును నీ కొరకే దేవా
నీ సేవలో నేను కొనసాగెదనయ్యా
ప్రకటింతు నీ ప్రేమ తుది శ్వాస వరకు‖ అంతే ‖

Related Tags

PraiseWorshipGrace