Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Anthya Dinamulayandu Aathmanu

అంత్య దినములయందు ఆత్మను

Anthya Dinamulayandu Aathmanu

Verse
అంత్య దినములయందు ఆత్మను
మనుష్యులందరి మీద కుమ్మరించుమయా‖ 2x ‖
దేవా యవ్వనులకు దర్శనము
కలుగజేయుము‖ 2x అంత్య ‖
Verse
కోతెంతో విస్తారము
కోసేడి వారు లేరు
యవ్వనులకు నీ పిలుపునిచ్చి
సేవకు తరలింపుము‖ 2x దేవా ‖
Verse
సౌలు లాంటి యవ్వనులు
దమస్కు మార్గము వెళ్లుచుండగా‖ 2x ‖
నీ దర్శనము వారికిచ్చి
పౌలు వలె మార్చుము‖ 2x దేవా ‖
Verse
సంసోను లాంటి యవ్వనులు
బలమును వ్యర్ధ పరచుచుండగా‖ 2x ‖
నీ ఆత్మ బలమును వారికిచ్చి
నీ దాసులుగా మార్చుము‖ 2x దేవా ‖

Related Tags

YouthHoly SpiritServiceRevival