Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Anthyakaala Abhishekam

అంత్యకాల అభిషేకం

Anthyakaala Abhishekam

Verse
అంత్యకాల అభిషేకం – సర్వ జనుల కోసం
కోతకాల దినములివి – తండ్రి నీ ఆత్మతో నింపుమా‖ 2x ‖
మండే అగ్నల్లె రా దేవా
అన్య భాషలతో అభిషేకించు
ఎగసే గాలల్లె నను తాకుమా
జీవనది వలెనే ప్రవహించుమా‖ 2x అంత్యకాల ‖
Verse
ఎముకల లోయలోన
గొప్ప సైన్యము నే చూడగా
నీ అధికారం దయచేయుమా
జీవమా రమ్మని ప్రవచించెద‖ 2x మండే ‖
Verse
కర్మెలు కొండ పైన
గొప్ప మేఘమై ఆవరించగా
ఆహాబు భయపడిన
అగ్ని వర్షము కుమ్మరించుమా‖ 2x మండే ‖
Verse
సీనాయి పర్వతమందు
అగ్ని పొద వలె నిను చూడగా
ఓ ఇశ్రాయేలు దైవమా
మాతో కూడా ఉన్నవాడా‖ 2x మండే ‖

Related Tags

Anointing