Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Anudhinamu Maa Bhaaramu

అనుదినము మా భారము

Anudhinamu Maa Bhaaramu

Chorus
అనుదినము మా భారము - భరించే దేవా
అనిశము నీ మేళ్ళతో - నింపుచున్నావు
Verse
సన్నుతించు మనిశము - నా ప్రణమా యేసుని
పరిశుద్ధ నామమును - పొగడు మెప్పుడు
ఒంటె బరువు దీవెనలు - వీపున మోసె
Verse
నా శరీరమున ముల్లు - బాధపరచుచుండగా
వేదనతో వేడగా - ధైర్యమిచితివి
నా కృప నీ కెల్లప్పుడు - చాలునంటివి
Verse
అపరాధముతో మేము చిక్కుకొని యుండగా
నీ రక్తముతో మమ్ము - విమోచించితివి
నీదు కృప మహదై-శ్వర్యంబును బట్టి
Verse
అన్నిటిలో నెప్పుడు - సకల సంపదలతోను
సమృద్ధితో మమ్ములను - సాకుచుంటివి
కృపా క్షేమములను మాపై - కుమ్మరించితివి
Verse
సర్వవేళల సంతృప్తిని - నేర్పినావు మాకిల
సకలంబును చేయుటకు - శక్తి నిచ్చితివి
బలపరచుము నిన్ను బట్టి - బలుడవు దేవా

Related Tags

PraiseThanksgivingGrace