Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Anudinamu Prabhuni

అనుదినము ప్రభుని

Anudinamu Prabhuni

Lyricist: Dr K Wilson
Verse
అనుదినము ప్రభుని స్తుతియించెదము
అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను
అల్లుకుపోయేది ఆర్పజాలనిది
అలుపెరగనిది ప్రభు ప్రేమ‖ 2x అనుదినము ‖
Verse
ప్రతి పాపమును పరిహరించి
శాశ్వత ప్రేమతో క్షమియించునది
నా అడుగులను సుస్థిరపరచి
ఉన్నత స్థలమున నింపునది‖ 2x అల్లుకుపోయేది ‖
Verse
ప్రతి రేపటిలో తోడై నిలిచి
సిలువ నీడలో బ్రతికించినది
స్వర్గ ద్వారము చేరు వరకు
మాకు ఆశ్రయమిచ్చునది‖ 2x అల్లుకుపోయేది ‖

Related Tags

PraiseWorshipGrace