Verse
అనుకరించెద నే ననుదినమును బాలుఁ డేసు ననువుగాను జ్ఞానమునం
దును వయస్సునందును దే వుని ప్రేమను మానవుల ద యను బెరిగిన
బాలుఁడేసు‖ ననుకరించెద ‖
Verse
పరదేశంబున వసించి పరమాత్తుని మదిఁ దలంచి దురితమును
జయించిన స చ్చరితుఁడైన యోసేపు‖ ననుకరించెద ‖
Verse
తల్లి యానతి నెరవేర్చి తమ్ముని కష్టములఁ దీర్చి యెల్లకాలముండు కీర్తి
నిల గడించిన మిర్యాము‖ ననుకరించెద ‖
Verse
పాలు మరచినది మొదలు ప్రభు సేవా సంపదలు ఆలయమునఁ
బూసిన సు బాలకుండు సమూయేలు‖ ననుకరించెద ‖
Verse
శత్రువులను బరిమార్చి మిత్రులకు జయంబొనర్చి స్తోత్రగీతములు
రచించిన సుందరుండౌ దావీదు‖ ననుకరించెద ‖
Verse
పరులకు న్యాయంబుఁ దీర్పఁ బ్రజలకు క్షేమంబుఁ గూర్పఁ పరమ
వివేకంబుఁ గోరి ప్రభు నడిగిన సొలొమోను‖ ననుకరించెద ‖
Verse
యజమానుని కుష్ఠుఁ గాంచి స్వజనుల దేవుని గురించి నిజ సాక్ష్య
మిడి సన్మా నించిన హెబ్రీయ బాల‖ ననుకరించెద ‖
Verse
అపవిత్ర రాజ భోజ నాదుల విడి దైవ పూజఁ గపట మింత లేక చేసి
ఘనత నొందిన దానియేలు‖ ననుకరించెద ‖
Verse
ప్రార్థన కూటమునఁ జేరి ప్రత్యుత్తర మపుడె కోరి సార్ధకముగఁ బేతురుని
సమాచార మిడిన రొదే‖ ననుకరించెద ‖
Verse
భక్తిభయములందుఁ బెరిగి బహు ప్రేదేశములను దిరిగి శక్తి కొలఁది
సంఘ పరి చర్య నొనర్చిన తిమోతి‖ ననుకరించెద ‖