Verse
అనుక్షణం నీ కృపలో ప్రతీదినం నీ సన్నిధిలో
నా జీవితం దాచినావు‖ 2x ‖
విడువని కృపతో ప్రేమించే నా యేసయ్య
ఎడబాయదు నీ అనురాగము‖ 2x ‖
Verse
శాశ్వత జీవము నను చేర్చుటకు
ఉన్నత మహిమ విడచితివి‖ 2x ‖
నా రక్షణకై నీ ప్రాణమును త్యాగము చేసావు‖ 2x ‖
దాసుని రూపము దాల్చిన దయగల యేసయ్య
సాగిలపడి నిను సేవించెద‖ 2x ‖
Verse
నా శోధనలో కలవరపడుచు
వేదనతో నిండే నా హృదయం‖ 2x ‖
నీ కనికరమే నను చేరదీసి ఆదరించినది‖ 2x ‖
ఆధారం ఆశ్రయం నీవే యేసయ్య
నను విడిపించి దీవించువాడవు‖ 2x ‖