Verse
అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి
అరుదైన రాగాలనే స్వరపరచి
ఆనందగానలే సప్త స్వరాలుగా నే పాడనా
Chorus
యేసయ్య నా హృదయ సీమను ఏలుమయ
నీ దివ్య సన్నిది చాలునయ
Verse
నీ జ్ఞాన ఆత్మయే వికసింపచేసెను నన్ను
సర్వ సత్యములలో నే నడచుటకు
మరపురాని మనుజాశాలను విడిచి
మనసార కొనియాడి జీవించెద ఇక నీ కోసమే
Verse
అపురూప దర్శనమే బలపరుచుచున్నది నన్ను
వెనుదిరిగి చూడక పోరాడుటకు
ఆశ్చర్యకరమైన నీ కృప పొంది
కడవరకు నీ కాడినే మోయుట నా తుది నిర్ణయమే
Verse
నీ నీతి నియమములే నడిపించుచున్నది నన్ను
స్వర్ణ కాంతిమయమైన నగరము కొరకు
అమూల్యమైన విశ్వాసము పొంది
అనుక్షణము నిన్ను తలచి హర్షించేనే నాలో నా ప్రాణమే