Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Anyajanulela

అన్యజనులేల

Anyajanulela

Lyricist: Songs Of Zion
Verse
అన్యజనులేల లేచి
గల్లత్తు చేయు-చున్నారు – అన్యజనులేల
జనములేల వ్యర్థమైన
దాని తలంచుచున్నవి‖ 2x అన్యజనులేల ‖
Verse
భూలోక రాజులు లేచి
వారేకముగా ఆలోచించి – భూలోక రాజులు
వారి పాశములను తెంపి
పారవేయుద మనుచున్నారు‖ 2x అన్యజనులేల ‖
Verse
ఆకాశ వాసుండు వారిని
అపహసించుచున్నాడు నవ్వి – ఆకాశ వాసుండు
వారలతో పల్కి కోపముతో
వారిని తల్లడిల్ల చేయును‖ 2x అన్యజనులేల ‖
Verse
పరిశుద్ధమైన నాదు
పర్వతమగు సీయోను మీద – పరిశుద్ధమైన
నారాజు నాసీనునిగా జేసి
యున్నానని సెలవిచ్చెను‖ 2x అన్యజనులేల ‖
Verse
కట్టడ వివరింతు నాకు
యిట్లు చెప్పెను యెహోవాయందు – కట్టడ వివరింతు
నీవు నా కుమారుడవు
నిన్ను నేను కనియున్నాను‖ 2x అన్యజనులేల ‖
Verse
నన్ను అడుగుము నీకు
జనముల భూమిని స్వాస్థ్యముగా – నన్ను అడుగుము
దిగంతముల వరకు
స్వాస్థ్యముగా నొసంగెదను నీకు‖ 2x అన్యజనులేల ‖
Verse
ఇనుప దండముతో నీవు
వారిని నలుగగొట్టెదవు – ఇనుప దండముతో
కుండను పగులగొట్టునట్లు
వారిని పగులగొట్టెదవు‖ 2x అన్యజనులేల ‖
Verse
ఓ రాజులారా మీరు
జ్ఞానవంతులై యుండుడి – ఓ రాజులారా
ఓ భూపతులారా మీరు
నాభోద నొందుడి నేడే‖ 2x అన్యజనులేల ‖

Related Tags

PraiseWorship