Chorus
అన్యజనులేల లేచి - గల్లత్తు చేయుచున్నారు‖ అన్యజనులేల ‖
Pre-Chorus
జనములేల వ్యర్థమైన దాని తలంచుచున్నవి
Verse
భూలోక రాజులు లేచి - వారేకముగా ఆలోచించి
వారి పాశములను తెంపి - పారవేయుద మనుచున్నారు
Verse
ఆకాశ వాసుండు - వారిని - అపహసించుచున్నాడు - నవ్వి
వారలతో పల్కి కోపముతో - వారిని తల్లడిల్ల చేయును
Verse
పరిశుద్ధమైన - నాదు - పర్వతమగు సీయోను మీద
నారాజునాసీనునిగా జేసి - యున్నానని సెలవిచ్చెను
Verse
కట్టడ వివరింతు - నాకు - యిట్లు చెప్పెను యెహోవాయందు
నీవు నా కుమారుండవు - నిన్ను నేను కనియున్నాను
Verse
నన్ను అడుగుము - నీకు - జనముల భూమిని స్వాస్థ్యముగా
దిగంతముల వరకు స్వాస్థ్యముగా నొసంగెదను నీకు
Verse
ఇనుప దండముతో - నీవు - వారిని నలుగగొట్టెదవు
కుండను పగులగొట్టునట్లు - వారిని పగులగొట్టెదవు
Verse
ఓ రాజులారా - మీరు - జ్ఞానవంతులై యుండుడి
ఓ భూపతులారా - మీరు - నాభోద నొందుడి నేడే