Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aparaadhini Yaesayya Krupa Joopi Brova

అపరాధిని యేసయ్య కృప జూపి బ్రోవ

Aparaadhini Yaesayya Krupa Joopi Brova

Lyricist: Siripurapu Krupanandamu
Chorus
అపరాధిని యేసయ్య కృప జూపి బ్రోవుమయ్యా
నెపమెంచకయె నీ కృపలో నపరాధములను క్షమించు‖ అప ‖
Verse
సిలువకు నిను నే గొట్టితిని తులవలతో జేరితిని
కలుషంబులను మోపితిని దోషుండనేను ప్రభువా‖ అప ‖
Verse
ప్రక్కలో బల్లెపుపోటు గ్రక్కున పొడిచితి నేనే
మిక్కిలి బాధించితిని మక్కువ జూపితివయ్యో‖ అప ‖
Verse
ముళ్లతో కిరీటంబు నల్లి నీ శిరమున నిడితి
నా వల్ల నేరమాయె చల్లని దయగల తండ్రీ‖ అప ‖
Verse
దాహంబు గొనగా చేదు చిరకను ద్రావనిడితి
ద్రోహుండనై జేసితినీ దేహంబుగాయంబులను‖ అప ‖
Verse
ఘోరంబుగా దూరితిని నేరంబులను జేసితిని
క్రూరుండనై గొట్టితిని ఘోరంపు పాపిని దేవా‖ అప ‖
Verse
చిందితి రక్తము నాకై పొందిన దెబ్బలచేత
నిందలు పెట్టితినయ్యో సందేహమేలనయ్యా‖ అప ‖
Verse
శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ దెచ్చితివయ్యా
అక్షయ భాగ్యము నియ్య మోక్షంబు జూపితివయ్యా‖ అప ‖

Related Tags

RepentanceSalvationConfession