Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aparaadhini Yesayyaa

అపరాధిని యేసయ్యా

Aparaadhini Yesayyaa

Lyricist: Siripurapu Krupanandamu
Verse
అపరాధిని యేసయ్యా
కృపజూపి బ్రోవుమయ్యా‖ 2x ‖
నెపమెంచకయె నీ కృపలో
నపరాధములను క్షమించు‖ 2x ‖
Verse
సిలువకు నిను నే గొట్టి
తులువలతో జేరితిని‖ 2x ‖
కలుషంబులను మోపితిని
దోషుండ నేను ప్రభువా‖ 2x ‖
Verse
ప్రక్కలో బల్లెపుపోటు
గ్రక్కున పొడిచితి నేనే‖ 2x ‖
మిక్కిలి బాధించితిని
మక్కువ జూపితి వయ్యో‖ 2x ‖
Verse
ముళ్ళతో కిరీటంబు
నల్లి నీ శిరమున నిడితి‖ 2x ‖
నా వల్ల నేరమాయె
చల్లని దయగల తండ్రి‖ 2x ‖
Verse
దాహంబు గొనగా చేదు
చిరకను ద్రావ నిడితి‖ 2x ‖
ద్రోహుండనై జేసితినీ
దేహంబు గాయంబులను‖ 2x ‖
Verse
ఘోరంబుగా దూరితిని
నేరంబులను జేసితిని‖ 2x ‖
కౄరుండనై గొట్టితిని
ఘోరంపు పాపిని దేవా‖ 2x ‖
Verse
చిందితి రక్తము నాకై
పొందిన దెబ్బల చేత‖ 2x ‖
అపనిందలు మోపితినయ్యో
సందేహమేలనయ్యా‖ 2x ‖
Verse
శిక్షకు పాత్రుడనయ్యా
రక్షణ దెచ్చితివయ్యా‖ 2x ‖
అక్షయ భాగ్యము నియ్య
మోక్షంబు జూపితివయ్యా‖ 2x ‖

Related Tags

WorshipRepentanceGood Friday