Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aparaadini Yesayya

అపరాదిని యేసయ్యా

Aparaadini Yesayya

Intro
అపరాదిని యేసయ్యా
అపరాధిని యేసయ్య
Chorus
అపరాధిని యేసయ్య - క్రపజూపి బ్రోవుమయ్యా
నెపమెంచకయె నీ క్రపలో - నపరాధములను క్షమించు‖ అపరాధిని ‖
Verse
సిలువకు నినునే గొట్టితీ - తులువలతో జేరితిని
కలుషంబులను మోపితిని - దోషుండ నేను ప్రభువా‖ అపరాధిని ‖
Verse
ప్రక్కలో బల్లెపుపోటు - గ్రక్కున పొడిచితి నేనే
మిక్కిలి బాధించితిని - మక్కువ జూపితి వయ్యో‖ అపరాధిని ‖
Verse
ముళ్ళతో కిరీటంబు - నల్లి నీ శిరమున నిడితి
నావల్ల నేరమాయె - చల్లని దయగల తండ్రీ‖ అపరాధిని ‖
Verse
దాహంబు గొనగా చేదు - చిరకను ద్రావినిడితి
ద్రోహుండనై జేసితినీ - దేహంబు గాయంబులను‖ అపరాధిని ‖
Verse
ఘోరంబుగా దూరితిని - నేరంబులను జేసితిని
క్క్రూరుండనై గొట్టితిని - ఘోరంపి పాపిని దేవా‖ అపరాధిని ‖

Related Tags

RepentancePassion Of ChristConfession