Verse
Aparadini Yesiah
అపరాధిని యేసయ్యా కృపజూపి బ్రోవుమయ్యా
నెపమెంచకయె నీ కృపలో అపరాధములను క్షమించు
Verse
ఘోరంబుగా దూరితిని నేరంబులను జేసితిని
క్రూరుండనై కొట్టితిని ఘోరంబు పాపిని దేవా
Verse
చిందితి రక్తము నాకై పొందిన దెబ్బలచేత
అపనిందలు మోపితినయ్యో సందేహమేలనయ్యా
Verse
శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా
అక్షయభాగ్యమునియ్య మోక్షంబు జూపితివయ్యా
Verse
దాహంబు గొనగా చేదు చిరకను ద్రావనిడితి
ద్రోహుండనై జేసితిని దేహంబు గాయములను