Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Appagimpabadina Raathri

అప్పగింపబడిన రాత్రి

Appagimpabadina Raathri

Lyricist: Padidem Anantha Rao
Verse
అప్పగింపబడిన రాత్రి
చెప్ప సాగే శిష్యులతో‖ 2x ‖
చెప్పరాని దుఃఖముతో
తప్పదు నాకీ మరణమనెను‖ 2x అప్పగింప ‖
Verse
రొట్టె విరచి ప్రార్ధించి
నిట్టూర్పు విడచి ఇది నా దేహం‖ 2x ‖
పట్టుదలతో నేనొచ్చుఁ వరకు
ఇట్టులనే భుజించుడనెను‖ 2x అప్పగింప ‖
Verse
ద్రాక్షా రస గిన్నెను చాపి
వీక్షించుడిదియే నా రక్తం‖ 2x ‖
రక్షణార్థం దీని త్రాగి
మోక్ష రాజ్యం చేరుడనెను‖ 2x అప్పగింప ‖
Verse
రాతివేత దూరాన
చేతులెత్తి ప్రభు మోకరించి‖ 2x ‖
నా తండ్రి నీ చిత్తమైతే
ఈ పాత్రన్ తీసి వేయుమనెను‖ 2x అప్పగింప ‖
Verse
ఇదిగో వచ్చె తుది ఘడియ
హృదయ బాధ హెచ్చెను‖ 2x ‖
పదిలపరచు-నట్లు తండ్రిన్
మదిలో వదలక ప్రార్ధించుడనెను‖ 2x అప్పగింప ‖

Related Tags

Good FridayCommunionMaundy Thursday