Chorus
అపు డర్చకాదు లుప్పొంగిరి ప్రభుని విపరీతముగఁ జంపసాగిరి
కృపమాలినట్టి పా పపు జిత్తమున నిష్ఠు రపు సిల్వమానిపైఁ బ్రభుని
వేయుట కొప్పి రపు డర్చ‖ రపు డర్చ ‖
Verse
యెరూషలేమను నూరి బైటను దుఃఖ కరమైన కల్వరిమెట్టను పరమ
సాధుని సిల్వ పైఁ బెట్టి తత్పాద కరమధ్యముల మేకు లరుదుగ దిగఁ
గొట్టి రపు డర్చ‖ రపు డర్చ ‖
Verse
చిమ్మె నిమ్మగు మేని రక్తము దాని నమ్ము వారల కెంతో యుక్తము
నెమ్మోము వాడి కెం దమ్మి పూవలె మస్త కమ్ము వేటులను ర క్తము జారి
కనుపట్టె నపు డర్చ‖ నపు డర్చ ‖
Verse
గడి దొంగ లిరువురుని బట్టిరి ప్రభుని కుడి యెడమలను సిల్వఁ
గొట్టిరి చెడుగు యూదులు బెట్టు కడు బాధలను మరియ కొడు
కోర్చుకొని వారి యెడ దయ విడఁడయ్యె నపు డర్చ‖ నపు డర్చ ‖