Verse
ఆరాధన స్తుతి ఆరాధన
ఆత్మతో సత్యముతో పూర్ణమనసుతో
సమర్పణతో స్తుతి ఆరాధన
Verse
అరణ్యములో ఆహరము
సమృద్ధిగా దయ చేసినవాడ
సంద్రములో ఆరిన నేలపై
నడువ చేసిన వాడా
సర్వాధికారి సర్వోనతుడా
సర్వ సృష్టికి కారకుడా
Verse
దేవుడవైయుండి మాకొరకై
మానవునిగా జన్మించితివే
దాసుడవై రిక్తుడవై
సిలువ మరణము పొందితివే
నీ రక్తమే పాప హరణం
నన్ను శుద్ధుని చేసేను