Chorus
ఆరంభించెద యేసు నీలో ప్రతీదినం
ఆనందించెద యేసు నీలో ప్రతీక్షణం
ఆస్వాదించెద నీ మాటలమాధుర్యం‖ 2x ‖
ఆరాధించెద నిన్నే నిత్యం‖ 2x ఆరంభించెద ‖
Verse
నీ సన్నిధిలో ప్రతి ఉదయం
ఆలించెద నీ మధుర స్వరం
అరుణోదయమున నీ సహవాసం‖ 2x ‖
నింపును నాలో నూతన ధైర్యం‖ 2x ఆరంభించెద ‖
Verse
నీ చిత్తముకై ప్రతి విషయం
అర్పించెద నీ కృపకోసం
వేకువ జామున నీ ముఖదర్శనం‖ 2x ‖
పెంచును నాలో ఆత్మవిశ్వాసం‖ 2x ఆరంభించెద ‖
Verse
నా పెదవులతో ప్రతినిమిషం
స్తుతియించెద నీ ఘననామం
దిన ప్రారంభమున నీ ప్రియజ్ఞానం‖ 2x ‖
కాల్చును నాలో అహం సర్వం‖ 2x ఆరంభించెద ‖