Verse
అర్పించుచుంటిని యేసయ్యా
నన్ను నీ చేతికి‖ 2x ‖
దీనుడను నన్ను నీ బిడ్డగా
ప్రేమతో స్వీకరించు‖ 2x అర్పించుచుంటిని ‖
Verse
ఈ లోక జీవితం అల్పకాలమే
నీవే నా గమ్యస్థానము‖ 2x ‖
నిజ సంతోషం నీవు నాకిచ్చి‖ 2x ‖
నా హృదయం వెలిగించు‖ 2x ‖
నా ప్రభువా యేసయ్యా‖ అర్పించుచుంటిని ‖
Verse
దప్పిగొన్న జింకవలెనే
ఆశతో చేరితి నీ దరి దేవా‖ 2x ‖
సేదతీర్చి జలము నిన్ను‖ 2x ‖
వాడిన బ్రతుకులో‖ 2x ‖
నింపుము జీవము‖ అర్పించుచుంటిని ‖