Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Arpinthu Sthuthul Nee Siluvaloanaa

అర్పింతు స్తుతుల్ నీ సిలువలోనా

Arpinthu Sthuthul Nee Siluvaloanaa

Chorus
అర్పింతు స్తుతుల్ నీ సిలువలోనా జూపిన నీ ప్రేమకై
మరణమొంది సమాధి నుండి మరల లేచితివి
Verse
తలను ముండ్ల కిరీటము బొంది కాళ్ల చేతులు గ్రుచ్చబడి
బలియైతివి గొఱ్ఱెపిల్ల వలె నా కొరకే ఓ ప్రభువా
Verse
నీ చింతవలన నాకు శాంతి కల్గె నీ సిలువ వలన కిరీటం
నీ మరణమే నా జీవమాయె నీ ప్రేమ గొప్పదెంతో
Verse
నేను జూచెడి మహిమ స్వర్గము నావలన కలుగదు
ఆనంద బాష్పములతోనే స్తుతింతు ఈ ధనము నా కొరకే
Verse
నీ సిలువలో తొలగె నా నీచ పాపము నే ద్వేషింతు నన్నియున్
నీ సింహాసనము నాలోన యుంచుము నిన్ను నే స్తుతించెదను

Related Tags

WorshipCrossSacrifice