Verse
అసాధ్యమైనది లేనే లేదు
నన్ను బలపరచువాడు నాతో ఉండగా‖ 2x ‖
ఊహించలేని ఆశ్చర్యక్రియలలో
నా దేవుడు నన్ను నడిపించును‖ 2x ‖
సాధ్యమే అన్ని సాధ్యమే
నా యేసు తోడైయుండగా‖ 2x ‖
Verse
శోధన శ్రమలు వచ్చినను
ఏ మాత్రము నేను వెనుతిరిగినను‖ 2x ‖
సత్య స్వరూపి సర్వోన్నతుడైన
గొప్ప దేవుడు నన్ను బలపరచును‖ 2x సాధ్యమే ‖
Verse
సాతాను శక్తులు ఎదిరించిన
వాక్యమనే ఖడ్గముతో జయించెదను‖ 2x ‖
సర్వశక్తుడు తన శక్తితో నింపి
సాతానుపై నాకు జయమిచ్చును‖ 2x సాధ్యమే ‖