Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Asamaanundagu O Kreesthu Advitheeyundagu Devaa

అసమానుండగు ఓ క్రీస్తు అద్వితీయుండగు దేవా

Asamaanundagu O Kreesthu Advitheeyundagu Devaa

Chorus
అసమానుండగు ఓ క్రీస్తు - అద్వితీయుండగు దేవా
అల్ఫాయు ఓమేగ (2) నీవే ప్రభువా‖ 2x 2x ‖
Verse
ఇహపరములలో నీ జన్మ - మహానందము కలిగించె‖ 2x ‖
అభయము నిచ్చి మాకు - భయభీతిని బాపితివి‖ 2x ‖
Verse
నీ జీవిత వాక్కులన్ని - సజీవము జనులందరికి
పావనుడా మా ప్రభు యేసు - అవనికి మాదిరి నీవే
Verse
మరణము గెల్చిన మా ప్రభువా - పరమ దేవుడవు నీవే
సాతానున్ ఓడించి - నీతిగా మము తీర్చితివి
Verse
పాపశాపముల బాపితివే - చూపితివే పరమదారి
శక్తిగల ఓ ప్రభువా - నీకే మా స్తోత్రములు
Verse
విశ్వమంతట ఓ దేవా - శాశ్వతమైనది నీ ప్రేమ
జ్ఞానమునకు మించినది - ఉన్నతమైన ప్రేమ
Verse
సంఘమునకు శిరస్సు నీవే - అంగములుగ మము జేసితివి
సర్వ సంపూర్ణుండా - సర్వ మహిమ నీకే

Related Tags

PraiseWorshipJesus