Chorus
అసామానుడైన వాడు – అవమానపరచడునిన్ను
ఓటమిఎరుగనీ మన దేవుడు – ఒడిపోనివ్వడు నిన్ను
ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు -కష్టకాలమందు
నీ చేయి విడచునా
అసాధ్యములెన్నో దాటించిన నాథుడు
శ్రమలో నిన్ను దాటిపోవునా
సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు
కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును
Verse
అగ్ని గుండాములో నెట్టివేసిన – సింహాల నోటికి
నిన్ను అప్పగించిన
శత్రువే నీ స్థితిచూసి అతిశయ పడుచున్న
సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన
నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమా
తేరిచూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై
శుత్రువు చేతికి నిను అప్పగించడు
Verse
పరిస్థితులన్నీ చేజారిపోయిన – ఎంతగానో శ్రమమపడిన ఫలితమే లేకున్నా
అనుకున్నవన్నీ దూరమైపోయిన – మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా
మారదీ తలరాతని దిగులుపడకుమా
మారాను మధురముగా మార్చును నీకై
మేలులతో నిను తృప్తిపరచును
Verse
ఒంటరి పోరాటమే విసుగురేపిన
పొందిన పిలుపే బారమైపోయిన
ఆత్మీయులందరు అవమానిస్తున్న
నమ్మదగినవారులేక నిరాశతో నిలిచిన
పిలుపునే విడచి మరలిపోకుమా
న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను
పిలిచిన దేవుడు నిను మరచిపోవునా