Verse 1
ఆశగా ఉన్నది ప్రభు, ఆశగా ఉన్నది..
Chorus
ఆశగా ఉన్నది ప్రభు, ఆశగా ఉన్నది
చూడాలని నిన్ను చూడాలని
చేరాలని నిన్ను చేరాలని‖ 2x ఆశ ‖
Verse
ఆత్మ ఫలముల సేద్యము కొరకై అభిలా దేశపు నది నాకివ్వు
ఆత్మీయ దాహము తీర్చుట కొరకై ఆ బంగారపు జలములనివ్వు
నిను భజియింపను నిను సేవించను
బోళపు పరిమళ సుస్వరమివ్వు‖ 2x ఆశ ‖
Verse
నీ నీతి రాజ్యము చేరుట కొరకై నిరతము నిన్నే వెదకెదనయ్యా
నీ సత్య ప్రేమను రుచిచూచుటకై నీ నామస్మరణమే చేసెదనయ్యా
నీవే మార్గము నీవే సత్యము
నీవేగా నా జీవన గానము‖ 2x ఆశ ‖