Chorus
ఆశ్రయుడా నా యేసయ్య
స్తుతి మహిమప్రభావము నీకేనయ్యా‖ 2x ‖
విశ్వవిజేతవు – సత్యవిధాతవు
నిత్యమహిమకు ఆధారము నీవు‖ 2x ‖
లోకసాగరాన కృంగినవేళ
నిత్యమైనకృపతో వాత్సల్యము చూపి
నను చేరదీసిన నిర్మలుడా
నీకేనయ్యా ఆరాధనా
నీకేనయ్యా స్తుతిఆరాధనా‖ 2x ‖
Verse
తెల్లని వెన్నెలకాంతివి నీవు
చల్లని మమతల మనసే నీవు‖ 2x ‖
కరుణనిచూపి కలుషముబాపి
నను ప్రేమించిన ప్రేమవు నీవు‖ 2x ‖
జనులకు దైవం జగతికి దీపం
నీవుగాక ఎవరున్నారు ?
నీవే నీవే ఈ సృష్టిలో
కొనియాడబడుచున్న మహరాజువు‖ 2x ‖
Verse
జీవితదినములు అధికములగునని
వాగ్దానముచేసి దీవించితివి‖ 2x ‖
ఆపత్కాలమున అండగనిలిచి
ఆశలజాడలు చూపించితివి‖ 2x ‖
శ్రీమంతుడవై సిరికే రాజువై
వ్యధలనుబాపి నా స్థితిమార్చితివి
అనురాగమే నీ ఐశ్వర్యమా
సాత్వికమే నీ సౌందర్యమా‖ 2x ‖
Verse
నీ చిత్తముకై అరుణోదయమున
అర్పించెదను నా స్తుతిఅర్పణ‖ 2x ‖
పరిశుద్ధులలో నీ స్వాస్థ్యముయొక్క
మహిమైశ్వర్యము నేపొందుటకు‖ 2x ‖
ప్రతివిషయములో స్తుతి చెల్లించుచు
పరిశుద్ధాత్మలో ప్రార్థించెదరు
పరిశుద్ధుడా పరిపూర్ణుడా
నీ చిత్తమే నాలో నెరవేర్చుమా‖ 2x ‖