Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Athi Sundarudavu Yesayya Manoharudavu Neevayya

అతి సుందరుడవు యేసయ్యా మనోహరుడవు నీవయ్యా

Athi Sundarudavu Yesayya Manoharudavu Neevayya

Lyricist: Hosanna Ministries
Verse
అతి సుందరుడవు యేసయ్యా మనోహరుడవు నీవయ్యా
యధార్థవంతుల సభలో పరిశుద్ధులతో కలసి
నిను ఆరాధించెదను
హల్లేలుయా హల్లేలుయా హోసన్నా ఆరాధన
నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు
కృపాక్షేమములు నీ మందిరములో సమృద్ధిగా కలవు
నే దీనుడనై నీ సన్నిధిని అనుభవించెదను
పరవసించి పరవళ్ళుతొక్కి ఆరాదించెదను
అమూల్యములైన వాగ్దానములు అనుగ్రహించావు
అత్యధికముగా ఆశీర్వదించి హెచ్చించియున్నావు
విశ్వాసముతో ఓర్పు కలిగి వాగ్దానమునే పొందెదను
సంపూర్ణతకై పరిశుద్ధుడనై ఆరాధించెదను
మహారాజువై సీయోనులో ఏలుచున్నావు
పుణాదులుగల పట్టణమును కట్టుచున్నావు
సౌందర్యముగల సీయోనులో ప్రకాశించుచున్నావు
నీ మహిమను పొంది నీ దరిచేరి ఆరాధించెదను

Related Tags

PraiseWorship