Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Athiparishuddhudaa Sthuthi Naivedyamu

అతిపరిశుద్ధుడా స్తుతి నైవేద్యము

Athiparishuddhudaa Sthuthi Naivedyamu

Lyricist: Hosanna Ministries
Verse
అతిపరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
నీకే అర్పించి కీర్తింతును‖ 2x ‖
నీవు నా పక్షమై నను దీవించగా
నీవు నా తోడువై నను నడిపించగా
జీవింతును నీ కోసమే – ఆశ్రయమైన నా యేసయ్యా‖ అతిపరిశుద్ధుడా ‖
Verse
సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా
ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే‖ 2x ‖
ముందెన్నడూ చవిచూడని
సరిక్రొత్తదైన ప్రేమామృతం‖ 2x ‖
నీలోనే దాచావు ఈనాటికై
నీ ఋణం తీరదు ఏనాటికి‖ 2x అతిపరిశుద్ధుడా ‖
Verse
సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని
గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే‖ 2x ‖
కృప వెంబడి కృప పొందగా
మారాను మధురముగా నే పొందగా‖ 2x ‖
నాలోన ఏ మంచి చూసావయ్యా
నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా‖ 2x అతిపరిశుద్ధుడా ‖
Verse
సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక
శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక‖ 2x ‖
ఉన్నావులే ప్రతిక్షణమునా
కలిసున్నావులే ప్రతి అడుగున‖ 2x ‖
నీవేగా యేసయ్యా నా ఊపిరి
నీవేగా యేసయ్యా నా కాపరి‖ 2x అతిపరిశుద్ధుడా ‖

Related Tags

PraiseWorshipDevotional