Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Athyunnatha Simhaasanamupai

అత్యున్నత సింహాసనముపై

Athyunnatha Simhaasanamupai

Lyricist: Amshumathi Mary
Verse
అత్యున్నత సింహాసనముపై – ఆసీనుడవైన దేవా
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే
ఆరాధింతును నిన్నే‖ 2x ‖
ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. హల్లెలూయా‖ 3x ‖
ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. ఆమెన్
Verse
ఆశ్చర్యకరుడా స్తోత్రం
ఆలోచనకర్త స్తోత్రం
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి
సమాధాన అధిపతి స్తోత్రం‖ 2x ఆహాహా ‖
Verse
కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం
కృపతో రక్షించితివే స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావు
నా రక్షణకర్త స్తోత్రం‖ 2x ఆహాహా ‖
Verse
స్తుతులపై ఆసీనుడా స్తోత్రం
సంపూర్ణుడా నీకు స్తోత్రం
మా ప్రార్థనలు ఆలకించువాడా
మా ప్రధాన యాజకుడా స్తోత్రం‖ 2x ఆహాహా ‖
Verse
మృత్యుంజయుడా స్తోత్రం
మహాఘనుడా స్తోత్రం
మమ్మును కొనిపోవ త్వరలో రానున్న
మేఘ వాహనుడా స్తోత్రం‖ 2x ఆహాహా ‖
Verse
ఆమెన్ అనువాడా స్తోత్రం
అల్ఫా ఒమేగా స్తోత్రం
అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా
అత్యున్నతుడా స్తోత్రం‖ 2x ఆహాహా ‖

Related Tags

PraiseWorshipAdoration