Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Athyunnatha Simhaasanamupai Aasieenudavyana dhevaa

అత్యున్నత సింహాసనముపై ఆశీనుడవైన నా దేవా

Athyunnatha Simhaasanamupai Aasieenudavyana dhevaa

Lyricist: Dr Darla Amshumathi Mary
Verse
అత్యున్నత సింహాసనముపై – ఆశీనుడవైన నా దేవా
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే – ఆరాధింతును నిన్నే
Chorus
ఆహహ హల్లెలూయ (7) ఆ…మేన్‖ 7x ‖
Verse
ఆశ్చర్యకరుడా స్తోత్రం – ఆలోచన కర్తా స్తోత్రం
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి – సమాధాన అధిపతి స్తోత్రం
కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం – కృపతో రక్షించితివే స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణ కర్తా స్తోత్రం
మృత్యుంజయుడా స్తోత్రం – మహా ఘనుడా స్తోత్రం మమ్మును
కొనిపోవ త్వరలో రానున్న- మేఘవాహనుడా స్తోత్రం
ఆమేన్ అనువాడా స్తోత్రం – అల్ఫా ఓమేగా స్తోత్రం
అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం

Related Tags

PraiseWorshipJesus