Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Avanilo Udbhavinche Aadisambhootunichoodare

అవనిలో ఉద్భవించే ఆదిసంభూతునిచూడరే

Avanilo Udbhavinche Aadisambhootunichoodare

Lyricist: Kr John
Verse
అవనిలో ఉద్భవించే ఆదిసంభూతునిచూడరే
పుడమియే పరవశించే పసిబాలుని చూడగనే
ఆకశమే పట్టనోడు ధరణిలో పుట్టినాడు
దావీదు పురమునందు దీనుడై వెలసినాడు రక్షకుడు‖ 2x ‖
ఆనందమే మహా ఆనందమే
అందరికీ ఇలలో సంతోషమే
ఆశ్చర్యమే ఇది అద్భుతమే
యెసు జననం అద్భుతమే‖ 2x ‖
అద్రుశ్య దేవుని మహిమా స్వరూపుడు
ఆది అంతమైన పరలోక నాధుడు‖ 2x ‖
ఆది యందు వాక్యంబుగా
సృష్టికార్యము జరిగించినాడు
అనాది నుండి జ్ఞానంబుగా
సృష్టికార్యము నడిపించినాడు
ఆది యందు వాక్యంబుగా
సృష్టికార్యము జరిగించినాడు
అనాది నుండి జ్ఞానంబుగా
సృష్టిక్రమము నడిపించినాడు
అన్నిటిని కలిగించిన మహ రాజు
కన్నీటిని తుడుచుటకు దిగివచ్చినాడు‖ 2x ‖
ఆనందమే మహా ఆనందమే
అందరికీ ఇలలో సంతోషమే
ఆశ్చర్యమే ఇది అద్భుతమే
యెసు జననం అద్భుతమే‖ 2x ‖
ప్రేమను పంచె పేమామయుడు
రక్షణ ఇచ్చీ రక్షించే దెవుడు
పాపమే లెనీ సుగుణాల సుందరుడు
శాపము బాపను జన్మించెను చుడు‖ 2x ‖
నిత్యముండు నీతి సూర్యుడు
సత్యసాక్షిగ ఇలకొచ్చినాడు
ప్రేమను పంచె పావనాత్ముడు
పశులపాకలో పవళించినాడు‖ 2x ‖
సర్వాధికారియైన మహరాజు
దీనులకు దీవెనగ ధిగివచ్చినాడు‖ 2x ‖
ఆనందమే మహా ఆనందమే
అందరికీ ఇలలో సంతోషమే
ఆశ్చర్యమే ఇది అద్భుతమే
యెసు జననం అద్భుతమే‖ 2x ‖
ఆకశమే పట్టనోడు ధరణిలో పుట్టినాడు
దావీదు పురమునందు దీనుడై వెలసినాడు రక్షకుడు‖ 2x ‖
ఆనందమే మహా ఆనందమే
అందరికీ ఇలలో సంతోషమే
ఆశ్చర్యమే ఇది అద్భుతమే
యెసు జననం అద్భుతమే‖ 2x ‖

Related Tags

WorshipJesusChristmas