Verse
అయ్యా వందనాలు.. అయ్యా వందనాలు
అయ్యా వందనాలు నీకే‖ 2x ‖
Verse
మృతతుల్యమైన శారా గర్భమును – జీవింపచేసిన నీకే
నిరీక్షణే లేని నా జీవితానికి – ఆధారమైన నీకే‖ 2x ‖
ఆగిపోవచ్చయ్యా జీవితము ఎన్నో దినములు
అయినా నీవిస్తావయ్యా వాగ్ధాన ఫలములు‖ 2x అయ్యా ‖
Verse
అవమానమెదురైన అబ్రహాము బ్రతుకులో – ఆనందమిచ్చిన నీకే
నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు – నిరీక్షణనిచ్చిన నీకే‖ 2x ‖
కోల్పోలేదయ్యా జీవితము నిన్నే చూడగా
జరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్యరీతిగా‖ 2x అయ్యా ‖