Chorus
అయ్యో నాదగు ఘోరపాపము గదా భారమై నీపై నొరిగె నెయ్యము
వీడి మెస్సీయ్య నిన్ సిలువ కొయ్యపైని గొరత కప్పగించిన‖ దయ్యో ‖
Verse
నిరతము దూతానీక మూడిగము నెరపుచుండఁ దండ్రి పజ్జనుండియు
నిరుపమాన సౌఖ్యములఁ దేలు నినుఁ బరమునుండి క్రిందికి దిగలాగిన‖ దయ్యో ‖
Verse
కోరి నిన్నుఁ గడుపారఁ గనియుఁ గను లారఁ చూచుకొన నేరనట్టి యల
మేరి గర్భమున దూయఁబడిన కడు ఘోరమైన ఖడ్గంబు నిజముగ‖ నయ్యో ‖
Verse
మొయ్యరాని పెనుకొయ్య నొండు నీ మూపుపైన భారముగ మోపి
రయ్యయ్యొ యింత బాధ సల్పినది యూ దయ్య వాసులెంత మాత్రమునుగా‖ రయ్యో ‖
Verse
కోలలచే నెన్నెన్నొ పెట్లు పెను గోలగాక యెన్నెన్నొ తిట్లు కృప మాలి
నీదు వదనమ్ముపై నుమియ నేల నింత కోపంబురాదు నిజ‖ మయ్యో ‖
Verse
ముండ్లతోడ మకుట మొక్క టల్లి కడు మూర్ఖత నీ తలపైనిఁ బెట్టి నీ
కండ్ల కొక్క గంతఁ గడ గండు పెట్టఁ గారణము నిజముగా‖ నయ్యో ‖
Verse
ఈపు ప్రాణమును నీవిగ నొసఁగ నీటెతోడఁ బ్రక్కను బొడుచుట హా
భావమందుఁ దలపోసి చూడ నల బంటు గాదు బల్లెంబు గాదు నిజ‖ మయ్యో ‖