Chorus
అయ్యో యిది దుఃఖము ప్రభు తీర్పువేళ నయ్యో యిది యెంత
దుఃఖము చయ్యన యెహోవా సింహా సనము చుట్టు వహ్ని మండు
నయ్యెడ విశ్వాసులకు దు రాత్మల కగు నిత్య ఖేద‖ మయ్యో ‖
Verse
తల్లి పిల్లలు గూడుదు రచటఁ దండ్రి తాత లచటఁ గలియుదు రెల్ల కాల
మటుల నుండ కెడబడి మరి యెపుడు చూడ‖ రయ్యో ‖
Verse
అన్నదమ్ములచటఁ గూడుదురు రక్క సెలియలందుఁ గలియుదు రెన్నఁ
డు మరి చూడ రాని యెడఁగల స్థలములకుఁ బోదు‖ రయ్యో ‖
Verse
భార్యాభర్తలు గూడుదురు రచట బంధు మిత్రులు కలియుదురు రందుఁ
కార్య భేదమువలన సర్వ కాలము మరి కూడఁజాల‖ రయ్యో ‖
Verse
క్రీస్తు మత ప్రబోధకులు స మస్త శిష్యులు కూడుదు రచట వాస్తవ స్థితు
లెరుఁగఁబడిన వలనను విడఁబడుదు రంద‖ రయ్యో ‖
Verse
శిష్టులు దుష్టులు కూడుదు రచట స్నేహవంతు లందుఁ గలియుదు
రిష్టము గాని భిన్నులగుచు నిఁక మరి యెన్నటికిఁ గూడ‖ రయ్యో ‖
Verse
అల పిశాచి పాపు లందరు నడుపు కర్తకు భిన్ను లగుచు పలుగొరుకుల
నిత్య నరక బాధల పాల్బడక పోరు‖ అయ్యో ‖
Verse
సాధు సజ్జనంబు లెల్ల సకల దూతలతోడఁ గూడి మోదముతో
ప్రభుని వెంట ముక్తి కేగి నిత్యులగుదు రాహా యిది యెంత విజయము
ప్రభు తీర్పు వేళ నాహా యిది యెంత విజయము‖ అయ్యో ‖