Verse 1
దేవా... యెహోవా...
నాకు చాలిన వాడా (4)
Verse 2
నడి సంద్రమున తుఫాను ఎగసినప్పుడు
నీవుంటివి యేసయ్యా
ఒక్క మాటతో తుఫాను ఆగెను
నీ మాట చాలును యేసయ్యా (2)
నా జీవితంలో తుఫానులు ఆపివేయుమా
నీ మాట చేత నన్ను నీవు లేవనెత్తుమా (2) ||దేవా||
Verse 3
అడవిలోన మన్నా కురిపించి
నీ బిడ్డగ పోషించితివి
బండ నుండి నీటిని తెచ్చి
దాహమును తీర్చావయ్యా (2)
నీ సమృద్ధిలో నుండి దయచేయుమా
నీ మహిమార్థమై నన్ను లేవనెత్తుమా (2) ||దేవా||