Verse 1
నా ఆశ్రయం ఆ సిలువే - నా ఆతిశయం ఆ సిలువే
మన రక్షణాధారం ఆ సిలువే - మన సమాధానం ఆ సిలువే
సిలువ విలువ తెలుసుకో - విలువైన మనషిగా మసలుకో || నా ఆశ్రయం ||
Verse 2
అభిషిక్తుని రక్తముతో మారెను పరిశుద్ధముగా
శిక్షయు శాపము మనకు దూరమాయెను
రక్షకుని స్పర్శయె మోక్షరాజ్య మార్గము
జీవితాన ఎన్నటికి - తిరుగులేని విజయము ||సిలువ ||
Verse 3
పాపియైన మనిషికి పరిశుద్ధుడు ప్రభునితో
సిలువే సమకూర్చెను సహవాసము
సాతాను శక్తులపై నిత్యము పోరాటము
విశ్వాస వీరులకు ఇదియే ఘన సాక్ష్యము ||సిలువ ||