పాపిగ నను చూడలేక – పాపముగా మారినావా
దోషిగ నను చూడలేక – నా శిక్ష నీవు పొందినావా (2)
నా తల యెత్తుటకు – నీవు తల వంచితివే
అర్హత నాకిచ్చుటకు – అవమాన-మొందితివే
తండ్రితో నను చేర్చుటకు – విడనాడబడితివే
జీవము నాకిచ్చుటకు – మరణము-నొందితివే
నీవే నీవే – నీవే దేవా
నీవే నీవే – నా యేసయ్యా (2)
పరమును వీడి ఈ భువికి
దిగి వచ్చిన రక్షకుడా
మహిమను వీడి నా వెలని
చెల్లించిన ప్రేమామయుడా
నే వెదకి రాలేనని సత్యమునెరిగి
నీవే నా దరికి పరుగెత్తితివి
దాసత్వము నుండి నను విడిపించి
తండ్రి అని పిలిచే భాగ్యము నిచ్చితివి ||నీవే||
నా స్థానములో నీవే నిలిచి
నీ స్థానమే నాకిచ్చితివి
సౌందర్యవంతునిగా నన్నే చేసి
సొగసంతా కోల్పోయితివి
నీ బలమంతా నాకే ఇచ్చి
బలియాగముగా నీవు మారితివి
ఐశ్వర్యవంతునిగా నన్నే చేసి
దీనతనే హత్తుకొంటివి ||నీవే||