Verse 1
కీర్తించి కొనియాడి ఘనపరతును - స్తోత్రించి స్తుతియించి నిను పాడెదన్
యేసయ్య - హల్లెలూయ - నా యేసయ్య హల్లెలూయ - 2
ఆరాధన స్తుతి ఆరాధన - ఆరాధన ఘన ఆరాధన
Verse 2
దేవాది దేవుడవు పరలోకమును వీడి మానవ రూపాన్ని ధరియించినావు
రాజులకు రాజువు ప్రభువులకు ప్రభుడవు నీవే నారక్షణ విమోచకుడా - 2 ||యే ||
Verse 3
నన్నెంతగానో ప్రేమించినావు - నీ ప్రాణమునే అర్పించినావు
నా ప్రాణ నాధుడవు - ఆధారభూతుడవు నీవే నారక్షణ విమోచకుడా - 2 ||యే ||
Verse 4
ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్త - బలవంతుడైన మా దేవుడా
నిత్యుడగు తండ్రి సమాధాన కర్త - నీవే మా రక్షణ విమోచకుడా - 2 ||యే ||