Verse 1
పరము నుండి పోయబడిన పరిమళ తైలం
యేసు నామం యేసు నామం
యేసు నామం శ్రీయేసు నామం - 2
Verse 2
దుర్గంధ పూరితమైన ఈ పాప జగతియందునా
ప్రేమ సుగంధాలు వెదజల్లిన నామం ప్రభావ భరితం యేసు నామం
ప్రభావ భరితము యేసు నామం
ప్రేమ సుగంధం యేసునామం ||యేసు ||
Verse 3
అత్యున్నతమైన నామం అవనిలో నామముల కన్నను
రక్షింపనేరదు ధర ఏ నామము పాపిని రక్షించే యేసునామం
ఉన్నత నామం అత్యున్నత నామం
రక్షించు నామం యేసు నామం ||యేసు ||
Verse 4
అత్యంత శక్తివంతము అద్భుతములు చేయు నామము
అపవాది శక్తులను ఎదిరించే ఆయుధం ప్రతి వ్యాధిని
స్వస్థపరచు పరమ ఔషధం - బలమైన ఆయుధం యేసు నామం
పరమ ఔషదం యేసు నామం ||యేసు ||