Verse 1
ప్రేమామృత ధారలు చిందించిన మన
యేసుకు సమమెవరు ఆ... ఆ...
ప్రేమయె తానై నిలచి - ప్రేమోక్తులనే పల్కి
ప్రేమతో ప్రాణముబెట్టి - ప్రేమనగరికి చనియె ఆ... ఆ...
Verse 2
నిశ్చలమైన ప్రేమమూర్తికి - ఇలలో తావేది ఆ... ఆ...
ప్రేమద్రోహులేగాని - ప్రియమున జేరరువాని
చేరిన చెలికాడగురా - సమయమిదే పరుగిడరా ఆ... ఆ... ||ప్రేమ ||
Verse 3
ఎంతఘోర పాపాత్మునియైనా - ప్రేమించును రారా ఆ... ఆ...
పాపభారముతోరారా - పాదములపై బడరా
పాపుల రక్షకుడేసు - తప్పక నిన్ను రక్షించున్ ఆ... ఆ... ||ప్రేమ ||
Verse 4
ఇంత గొప్ప రక్షణను - నిర్లక్ష్యము చేసెదవేల ఆ... ఆ...
రక్షణ దినమిదియేరా - తక్షణమే కనుగొనరా
ఇదియే దేవుని వరము - ముదమారగ చేసుకొనుము ఆ... ఆ... ||ప్రేమ ||