Verse 1
స్తుతి నీకే - సంస్తుతి నీకే
స్తుతి నీకే స్తోత్రార్హుడా - సంస్తుతి నీకె పూజార్హుడా
Verse 2
మహిమ సింహాసనాసీనుడవు
విశ్వమంతయు నిండియున్నావు
కరములు జోడించి చేసే స్తుతులన్నీ
నీ చరణముల వ్రాలి పాడే కృతులన్నీ ||స్తుతి|| ||ఆది ||
Verse 3
ఏడుదీప స్థంభముల మధ్యను
సంచరించే దైవ తనయుడవు
వాక్యఖడ్గధారివి - పునరుత్థానమైతివి
సప్తస్వరాలతో చేసే స్తుతులన్నీ
నీ గుణాతిశయముల పొగడేకృతులన్నీ ||స్తుతి|| ||ఆది ||
Verse 4
ఆది అంతము - అల్ఫ ఓమేగై యున్న నీకే
మొదటివాడును కడపటి వాడై యున్న నీకే ||2||